స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర
సూర్య సిద్ధాన్త పంచాంగం 2021 - 2022
మిధున రాశిః- (కా,కి,కూ,ఘం,జ్ఞ,ఛ,కె,కో,హ)
ఈ అక్షరములు కల ఈ రాశివార్కి ఆదాయం 5, పూజ్యం 3, అవమానము6. ఈ రాశి వారి స్ర్తీ పురుష లక్షణములుః- ఏకాగ్రత తక్కువ, చురుకుదనము ఎక్కువ. ఎప్పుడును ఆలోచించుదురు. బుద్ధిశ్చాంచల్యం, చక్కని వాక్చాతుర్యము, హాస్య సంభాషణ, అనేక విషయాలలో ప్రజ్ఞ కలిగి ఉండడం. స్ర్తీ క్రీడలయందు ఆసక్తి, పరోపకార పరాయణులు, డబ్బు, పేరు, కీర్తి, ప్రేమ, ఉద్యోగం, అంతస్తులు వేటితోను వీర్కి సంతృప్తి ఉండదు. జ్ఞపశక్తి యధికము, అధికార భోగ భాగ్యములు, వ్యక్తుల యొక్క పరిస్థితులను బట్టి మంచి చెడులాలోచించు స్వభావము, అదృష్టము, చంచలముగ నుండును. జీర్ణకోవ సంబంధ వ్యాధులు, లివరు, మూత్రపిండ విషయములందు జాగ్రత్తయవసరము.
ఈ రాశి వారికి 9లో గురువు, 8లో శని, 12లో రాహువు, 6లో కేతువు సంచారము చేత చుయు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి జాగ్రత్త అవసరం. ధననష్టము తరచు అవాంతరములు నేత్రములకు పీడయు శతృమూలమున భయము ప్రయత్న కార్యములు చెడిపోవుటయు, తరచు ప్రయాణములు స్థానచలన సూచనలు, బంధుమిత్ర విరోధము, ప్రాణభయము, ఆకస్మిక అపాయములు, రోగములు సంభవించును. కుటుంబ ఆర్థిక వ్యవహరములు అనుకూలముగా ఉండును. కులాచారముల మందు శ్రద్ధయు, బోజన సౌఖ్యము, స్ర్తీ సౌఖ్యము, సోదర సహకారము, విదేశి వ్యవహరముల మందు సుఖము, కోర్టు వ్యవహరములలో జయము, జీవిత భాగస్వామి వల్ల సుఖము, సంతోషము. గతంలో నిలిచిపోయిన పనులు నెరవేరుట, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్థులకు శుభసూచనలు, వ్యవసాయ రంగాల వారికి పంటలు పండి అధికలాభములుండును. ఫ్యాన్సీ, కిరాణా, వస్ర్త వ్యాపారులకు అభివృద్ధియు అధిక ఆదాయము. మద్యం ప్రత్తి వ్యాపారులకు ఆదాయమధికము. న్యాయవాద, వైద్య, ఇంజనీరింగ్ వారికి ఉన్నతముగా సముచితమైన స్థానములో ఉందురు. ఫైనాన్స్ బ్రోకర్లు, కంట్రాక్టు రంగాల వారికి ఆదాయమున్నను వైరములు అధికంగా నుండును. కంప్యూటర్ రంగాల వారికి లాభములధికము. ముఖ్యమైన వ్యక్తుల కలయిక, కఠినముగ మాట్లాడుట, కోపమధికము. వ్యయ ప్రయాసలధికము. మానసిక ఆందోళన అధికము. విద్యార్థులు విశేష కృషి సల్పిన ఉత్తీర్ణత పొందుదురు. ఈ రాశి వారు ప్రతిరోజు శ్రీ రామరక్షా స్తోత్రము ఆదిత్య హృదయము పఠించిన మేలు కలుగును. ఈ రాశి వార్కి ఆది, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారములు 2,3,4,5,9 తేదీలు శుభదాయకములు. మృగశిర వారు పగడమును, ఆర్థ్ర వారు గోమేధికమును పునర్వసు వారు పుష్యరాగమును ధరించి శుభ ఫలితములను పొందగలరు.
తి.న.చ. సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాన్తి