స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర
సూర్య సిద్ధాన్త పంచాంగం 2021 - 2022
వృశ్చికరాశిః- (తో, నా, ని, ను, నే, నో, యా, యో, యు)
ఈ అక్షరములుకల ఈరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, పూజ్యం 4, అవమానము 5. ఈ రాశి వారి స్త్రీ పురుష గుణములుః వీరి లక్షణము చిత్రమైనదిగా యుండును. రహస్యములను బయటకు చెప్పరు. మాటలు వాడిగ, కఠినముగా వుండును. మనసు మాత్రం అతి సున్నితమైనది. స్నేహితులకు ప్రాణము ఇచ్చుటకైనను వెనుకాడరు. శారీరక మానసిక కష్టాలను ఓర్పుతో సహించగలుగుతారు. త్యాగబుద్ధి, నిర్మోహమాటము, తీవ్రముగా విమర్శించడం, కక్ష సాధించడం, పరోపకారం చేయడం ధైర్యమెక్కువ. ఆత్మ విశ్వాసం సహనం కల్గి ఉంటారు. డబ్బు దారాళంగా ఖర్చు పెడతారు. తీవ్రంగా విమర్శిస్తారు. మానసికంగా ఎంతో గట్టివారు. స్థిరచిత్తులు ఏదైనా అభిప్రాయము అడిగితే నిర్మోహమాటంగా చెప్పెస్తారు. ధైర్యం, చొరవ, త్యాగము, ఆత్మ విశ్వాసము కల్గి ఉంటారు. మానసక శ్రమలను ఓర్పుతో భరింపగలరు.
ఈ రాశి వారికి 3లో శని, 4లో గురువు, 7లో రాహువు, 1లో కేతువు సంచారము చేత చేయు వృత్తి, ఉద్యోగ వ్యాపార వ్యవహరముల యందు అనుకూలముగా యున్నది.
సంతోషము, బుద్ధి, బలము ప్రయత్న కార్యముల యందు జయము. సుఖ జీవనము, ఆరోగ్యము కృషివరులకు అధిక లాభము శుభకార్యాచరణము, నూతన వ్యక్తుల పరిచయములు, ధర్మకార్యాచరణము, మనస్సుకు ఆనందము, కోర్టు వ్యవహరముల యందు జయము, కుటుంబ వ్యవహరముల యందు సంతోష మధికము. బంధుమిత్ర సహయ సహకారములు స్థిరాస్తులకు సంబంధించిన విషయములయందు జాగ్రత్త అవసరము. కుటుంబ సౌఖ్యము పుణ్యతీర్థ సందర్శనము, తీర్థయాత్రా ఫలప్రాప్తియు, నూతన అభరణముల కొనుగోలు, ఫైనాన్స్ బ్రోకర్లు, కాంట్రాక్టర్లకు రావలసిన ద్రవ్యము ఆలస్యమగును. కిరాణా, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులకు అధిక ఆదాయముండును. ప్రత్తి, మధ్యం వ్యాపారులకు మధ్యమముగా నుండును. వైద్య, న్యాయవాద ఇంజనీర్ల రంగాల వారికి కృషి సల్పిన పనులు నెరవేరును. రాజకీయ నాయకులు జాగ్రత్తగా మెలగవలయును. బంధుమిత్ర సమాగమము క్రయ విక్రయముల వలన ధనలాభము సంఘమున గౌరవము కాపాడుకొనవలయును. అకారణ కలహములు స్థిరత్వము లేకపోవుటయు కఠినముగా మాట్లాడరాదు. జాయింటు వ్యాపారములు కల్సి రావు. ఇంటా బయట సమస్యలధికము. విదేశీ సంచారము, శరీరమున వాత రోగ భయములు, స్త్రీ మూలక కలహ కారణములు, ప్రయాణములందు మోసము, సహోదరులతో కలహములు అధిక శ్రమయు జాగ్రత్తగా మెలగవలయును. ఈ రాశివారు ప్రతిరోజు దశావతార స్తోత్రము. శ్రీ రామరక్షా స్తోత్రము పఠించిన మేలు కలుగును. ఈ రాశి వారికి సోమ, బుధ, గురువారములు 9, 18, 27, 12, 15, 24, 30 తేదీలు యోగ ప్రదములు. విశాఖ వారు పుష్యరాగమును అనూరాధ వారు నీలమణిని, జ్యేష్ఠా వారు పచ్చను ధరించిన శుభములు చేకూరును.
తి.న.చ. సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాన్తి