స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర
సూర్య సిద్ధాన్త పంచాంగం 2021 - 2022
కర్కాటకరాశిః - (హి, హు, హే, ఢా, డీ, డూ, డే, డో)
ఈ అక్షరములకు కల ఈ రాశివారికి ఆదాయం 14, వ్యయం 2, పూజ్యం 6, అవమానము6. ఈ రాశివారి స్త్రీ పురుష లక్షణములుః- మంచి రాజకీయ వేత్తలు. జీవితంలో జరిగిన అనుభవాలు, అనుభూతులు మనస్సును ఒక విధంగా బయట పెట్టరు. ప్రతిది ఆలోచించడం వీరి లక్షణము. మనస్సు క్షణము కోపం, క్షణము తాపము, ఓర్పు తక్కువ. ప్రేమ, ద్వేషము అతి సూక్ష్మవిషయములయందు చక్కని ఊహా కల్పనాశక్తి, సమయము సందర్భము లేకుండా ఆవేశపడుట, ఊహలకు తప్పులేకుండ అంచనాలు వేయు సామర్థ్యము కలవారు. చిత్తమయిన ప్రవర్తన అంతర శతృవులుందురు. నియమబద్ధమైన జీవితము నిశ్చలమైన స్వభావముండదు. నమ్మకములుండవు. ఔదర్యముండదు. లలిత కళలందు అభిరుచి మంచి వాగ్ధాటిపైకి మెత్తగా కనిపించినా అవసరమైనప్పుడు దైర్య సాహసాలు చూపిస్తారు.
ఈ రాశి వారికి 8లో గురువు, 7లో శని, 11లో రాహువు, 5లో కేతువు సంచారము చేత చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహరముల యందు మిశ్రమ ఫలితములున్నను జాగ్రత్తగా మెలగవలయును. చోరాగ్ని రాజభాధలు తేజోహీనమును అధైర్యము కఠినముగ మాటలాడుటయు కోపము హద్దుమీరి నడచుటయు, దూరదేశ సంచారము, మనోవిచారము, మహా భయము, ధన నష్టము, కుటుంబము నందు చిక్కులు, సంతానముతో విరోధము, వేళనతిక్రమించి భుజించు చుండుటయు, ఆర్థిక వ్యవహరముల యందు జయము, గృహమున శుభకార్యాచరణము, బంధుమిత్ర విరోదము, విదేశ సంచారము. కోర్టు వ్యవహరములందు జయము, శారీరక రుగ్మతలు ఏర్పడుటయు, బూవివాదములు తొలగుతాయి. వృత్తి ఉద్యోగముల వారు జాగ్రత్తగా మెలగవలయును. వ్యవసాయ రంగాల వారికి పంటలు కల్సి వచ్చును. ఫైనాన్స్, బ్రోకర్లు, కంట్రాక్టర్లు రంగాల వ్యాపారులకు ఆదాయమధికము. మద్యం ప్రత్తి వ్యాపారులకు విశేష ఆదాయము. వస్త్ర, కిరాణా, ప్యాన్సీ వ్యాపార రంగాల వారికి ఆదాయమధికము. కళాకారులకు విశేష అవకాశములుండును. జ్యోతిష, వాస్తు, పురోహిత పండితులకు ఆదాయము అధికము. సంఘమున గౌరవము కాపాడుకొనవలయును. రాజకీయ నాయకులకు యోగకాలము కళత్రముతో విరోధము, కుటుంబ సౌఖ్యం. చేయుపనులకు ఆటంకములు చెడు పనులకు దూరంగా ఉండుట మంచిది. స్త్రీ మూలకంగా లాభము, నూతన పనులు తలపెట్టుట, శతృమూలమున భయము, స్వజనులతో కలహము, కృషివరులకు స్వల్ప లాభము, తీవ్ర వ్యతిరేకతలు, అకాలభోజనము, ఉద్యోగస్థులకు
ఉత్సాహ భంగము, జాయింటు వ్యాపారములు కల్సిరావు. న్యాయబద్ధముగా ప్రవర్తించిన కీర్తి గౌరవము కలుగును. పుణ్య తీర్థ సందర్శనము తీర్థయాత్రత ఫలప్రాప్తియు మొదలగు మిశ్రమ ఫలితములుండును. ఈ రాశి వారు ప్రతినిత్యము సుందరకాండ సప్తసర్గ పారాయణమొనరించిన శుభ ఫలితము చేకూరును. ఈ రాశి వారికి ఆది, బుధవారములు శుభప్రదములు. సోమ, మంగళ, గురు, శుక్రవారములు 1,11,20,29 తేదీలు యోగదాయకములు. పునర్వసు వారు పుష్యరాగమును పుష్యమి వారు నీలమణిని ఆశ్లేష వారు పచ్చను ధరించి శుభఫలితములు పొంగలరు.
తి.న.చ. సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాన్తి