స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర
సూర్య సిద్ధాన్త పంచాంగం 2021 - 2022
కన్యారాశిః- (టో, పా, పూ, ష, ణా, ఠ, పె, పో)
ఈ అక్షరములు కల ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయం 5, పూజ్యం 5, అవమానము 2. ఈ రాశివారి స్త్రీ, పురుష లక్షణములుః- ఈ రాశి స్త్రీ, పురుష గుణములుః- వాత్సల్యము, బంధుప్రేమ, అభిమానము, మనస్సు సౌకుమార్యము, గృహమునందు సౌఖ్యము, సున్నితమైన పనితనము చూపించుట, ఆరోగ్యమును గూర్చిన దిగులు హెచ్చుగా ఉండును. సత్యహక్కు కలవారు, విమర్శనా బుద్ధి కలవారు ధనకాంక్ష అధికము. ఆహారము, శయనము, గృహములు, వస్త్రములు, కేశాలంకారము తీర్చి దిద్దుకొనుటయందెక్కువ కాలము వినియోగింతురు. మంచి తెలివి తేటలు కలిగి ఉందురు. పొదుపు ఎక్కువ. ఎంతో కష్టపితే కాని డబ్బురాదు. ఎవరిమీద అధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని ఆవిస్తారు. వీరికి అసభ్యకరమైన ప్రవర్తన, అసభ్యకర సంభాషణ నచ్చదు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం వీరికి అలవాటు.
ఈరాశి వారికి 5లో శని, 6లో శని, 6లో గురువు, 3లో కేతువు, 9లో రాహువు సంచారము చేత చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి సామాన్య ఫలములుండును. జాగ్రత్తగా యుండుట అవసరము. భూ గృహ ధనధాన్య నష్టమును త్రిప్పుట కార్య విఘ్నములు. అపకీర్తియు, మనస్తాపము, సహోదరులతో కలహు వివిధ రూపముల కష్టములు ప్రాప్తించుటయు. ప్రయత్న కార్యములు నెరవేరకుండుటయు, మనోవిచారము, జ్ఞాతి విరోదము, నీచుల పరిచయము వలన కష్ట నష్టములు. దారా పుత్ర విరోధము స్వజనులతో కలహము చోరుల వలన, అగ్నివలన, రాజుల వలన భయము కలుగును. బంధుమిత్రుల కలయికతో జాగ్రత్త అవసరము. తొందర పాటు పనికిరాదు. ఋణ బాధలుండును. శుభకార్యాచరణము, యజ్ఞ యాగాది క్రతువులలో పాల్గోనుటయు స్వంత నిర్ణయము లవసరము. వ్యవసాయదారులకు లాభము. రాజకీయ రంగాల వారికి, నాయకులకు వత్తిడులధికము. ఫైనాన్స్ బ్రోకర్లు, కాంట్రాక్టర్లకు పెట్టుబడుల వలన లాభములుండును. ఫ్యాన్సీ కిరాణా, వస్త్ర వ్యాపారులకు ఆదాయ మధికము. మధ్యం విక్రయించు వారికి అధిక ఆదాయము, ప్రత్తి వ్యాపారులకు ధనాదాయమధికము. వైద్య, న్యాయవాద, ఇంజనీరింగ్ వారికి కొంచెం జాగ్రత్త అవసరము. జాగ్గత్తగా వున్నచో మేలు కలుగును. నూతన పనులు తలపరాధు. నూతన వ్యక్తులను నమ్మరాదు. ఆలోచనకు తగిన పనులు చేయడం మంచిది. పుణ్య తీర్థ సందర్శనము ధర్మకార్యాచరణము, సినీరంగ కళాకారులకు ఆదాయ మార్గములధికము. శరీరము శుష్కించుటయు, స్థిరత్వము లేకపోవుటయు, స్త్రీ మూలక కలహ కారణములు ఇంటా బయట సమస్యలధికము. దేవతా దర్శనములు అవసరము. ఉద్యోగస్థులు జాగ్రత్తగా నుండవలయును. కృషివరులకు అధిక లాభము. విద్యార్థులు, విద్యయందు శ్రద్ధ వహించ వలయును. ఈ రాశి వారు ప్రతినిత్యము దశావతార స్తోత్రము అధిత్య హృదయము పఠించిన మేలు కలుగును. ఈ రాశి వారికి బుధ, శుక్ర వారములు 55,14,23 తేదీలు శుభయోగ ప్రదములు. ఉత్తర వారు కెంపును, హస్త వారు ముత్యమును, చిత్త వారు పగడమును ధరించి శుభ ఫలితములు పొంగలరు.
తి.న.చ. సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాన్తి