స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర
సూర్య సిద్ధాన్త పంచాంగం 2021 - 2022
తులారాశిః - (రా, రి, రు, రె, రో, తా, తీ,తు, తే)
ఈ అక్షరములు కల ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, పూజ్యం 1, అవమానము 5. ఈ రాశి స్త్రీ, పురుష గుణములుః- తులాదండం లాగా వ్యవహరిస్తారు. సుకుమారమైన మనస్తత్వము, సుఖజీవనము, చక్కటి ప్రవర్తనయు, చురుకుతనము, ప్రశాంతమైన జీవితము, ప్రశాంతమైన స్వభావము, చక్కటి ప్రవర్తనము, గౌరవము, శుచి శుభ్రత అధికము. వినోద విలాసములు, అధికంగా కష్టపడలేరు. అధిక సంచార ప్రియులు. క్రయ విక్రకయములందు అభిరుచికలవారు బంధుప్రేమ అభిమానవంతులు ధనకాంక్ష అధికము. అతి సూక్ష్మగ్రాహికులు, గర్వమధికము, ితరుల కనుకూలముగా అభిప్రాయములను మలచుకుందురు. పొగడ్తలకు లొంగిపోవుదురు. తీవ్రమైన ఆపేక్ష కలవారగుదురు. నిజాయితీపరులు. అలంకార ప్రియులు, చిత్రమయిన లక్షణములు కల్గి ఉందురు.
ఈ రాశి వారికి 4లో శని, 5లో గురు, 8లో రాహువు, 2లో కేతువు సంచారము చేత చేయువృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగముల వారికి జాగ్రత్తగా మెలగవలయును. వాహన ప్రమాదములు శరీరమున వాతరోగములు ప్రవేశించుటయు మనస్తాపము, బయము, స్థానచలనము, శరీర అనారోగ్యతయు వివిధ రూపముల కష్టములు ప్రాప్తించుటయు, కుటుంబము నందు చిక్కులు, చికాకులు, శరీర పీడయు, మనోవిచారము, క్రూర జంతు బయములును రాజదండ నాది భయమును తరచు ప్రయాణములు ప్రయత్న కార్యములు చేయుట. ఆకస్తిక ప్రయాణములు ధనధాన్య నష్టములు వృధాశ్రమయు, అపమృత్యు భయములు, దాయాదులతో విరోధము, నమ్మిన వారి వలన మోసములు, జాయింటు వ్యాపారముల యందు నష్టములు, ప్రయాణ ప్రమాదములు. సంతానముతో వైరము, కఠినముగా మాటలాడరాదు. సదా విచారము, కీళ్ళనొప్పులు, అజీర్ణ బాధలధికము. కోర్టు వ్యవహరముల యందు, ఆస్తి తగాదాలు పరిష్కార మార్గములో నుండును. ఉద్యోగస్థులు జాగ్రత్తగా నుండవలయును. వ్యవసాయదారులకు మేలు కలుగును. ఫ్యాన్సీ, కీరణా, వస్త్ర వ్యాపారులకు ఆదాయము విశేషంగా వుండును. మధ్యం ప్రతి వ్యాపారులకు సమస్యలు అధికం. ఫైనాన్స్ బ్రోకర్లు, కాంట్రాక్టర్లకు ఇతర ఆదాయ మార్గములుండును. వైద్య, న్యాయవాద ఇంజనీర్లకు మేలు కల్గును. రాజకీయ రంగాల వారికి జాగ్రత్త అవసరము. యజ్ఞ యాగాది క్రతువులలో పాల్గొనుట, పుణ్యతీర్థ సందర్శనము, తీర్థయాత్ర ఫలప్రాప్తియు. శుభ కార్యాచరణము, కఠినముగా మాటలడరాదు. స్త్రీ మూలక కలహ కారణములు నీచుల పరిచయముల వలన కష్టములు సంభవించును. దాయాదులతో విరోదము, ధర్మ కార్యాచరణము మొదలగు ఫలితములుండును. ఈ రాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయము గాయత్రీ రామాయణము, దశావతార స్తోత్రము పఠించిన శుభములు కలుగును. ఈ రాశి వారికి మంగళ, గురు, శుక్ర వారములు, 3, 6, 9, 12, 15, 18, 20, 24, 30 తేదీలు యోగప్రదములు. చిత్త వారు పగడమును, స్వాతి వారు గోమేధికములను విశాఖ వారు పుష్కరాగమును ధరించి శుభ ఫలితములు పొందగలరు.