స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర
సూర్య సిద్ధాన్త పంచాంగం 2021 - 2022
థనుస్సు రాశిః- (యే, యో, భా, బి, ధా, భా, ఢ, భే)
ఈ అక్షరములు కల ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 7, అవమానము 5. ఈ రాశి వారి స్త్రీ, పురుష గుణములుః- మంచి అవయవపుష్టి, ఆకర్ష జీయమైన రూపం. అభిజాత్యం ఎక్కువ దైవభక్తి పాపభీతి ఎక్కువ ఏ విషయమునైనను వెంటనే గ్రహించి నిర్ణయము తీసికొందరు. దైవ శక్తి కల్గి సాంప్రదాయములు పాటిస్తారు. చాలామంది మనస్సు మంచిదని స్నేహంకోసం అభిలషిస్తారు. మనస్సులో ఏదీ దాచుకోరు. అనుకున్నంత తొందరగా పైకి రాలేరు. పోడవైన ముఖము, భక్తి కలవారు, త్యాగము, ఔదార్యవంతులు, ఉత్సాహం, ధైర్యం, ఆరోగ్యం, చొరవశక్తి కల్గి ఉంటారు. జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు. ధృడమైన శరీరము కలిగియుందురు. భోగ, భాగ్యములననుభవింతురు. పట్టుదలతో కార్యసాధన చేయగలుగుతారు.
ఈ రాశి వారికి 2లో శని, 3లో గురువు, 6లో రాహువు, 12లో కేతువు సంచారము చేత చేయు వృత్తి, ఉద్యోగ వ్యాపార వ్యవహరముల యందు జాగ్రత్తగా మెలగవలయును. మనోవిచారము దరిద్ర బాధలు శరీర పీడయు ఉద్యోగ భంగము అకారణ కలహము వృధా కలహములు ప్రయత్న కార్యములు చెడిపోవుటయు పాపకర్మలందాసక్తియు సర్వజన విరోధము సహోదరులతో కలహము బంధుమిత్ర విరోధములు ఆలోచనలధికము. సంతానము ద్వారా చిక్కులు, చికాకులు, కోర్టు వ్యవహరముల యందు ఆలస్యము. జీవిత భాగస్వామికి అనారోగ్యతలు అనుకొని ప్రయాణముల వలన ప్రమాదములు స్థిరాస్థి విషయములో కలహములు క్రయవిక్రయముల యందు జాగ్రత్తగా మెలగవలయును. కృషివరులకు అధిక లాభము. కిరాణా, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులకు ఆదాయ మధికముగా వున్నను మనస్తాప ముండును. ఫైనాన్స్, కాంట్రాక్టర్, బ్రోకర్ వ్యాపార రంగాల వారు అనేక మార్గముల ఆదాయము పొందటాన్ని ప్రయత్నిస్తారు. వైద్య, న్యాయవాద ఇంజనీర్ రంగాల వారు చేపట్టిన వృత్తులలో ఆలస్యముగా విజయము సాధించుదురు. రాజకీయ నాయకులకు పదవీ గండములున్నందున జాగ్రత్తగా మెలగుట అవసరము. క్రీడాకారులకు నిరూత్సాహము, గృహమున శుభకార్యాచరణము, పుణ్యతీర్థ సందర్శనము, యఙ్ఞ యాగాది క్రతువులలో పాల్గొనుట, తీర్థయాత్రా ఫలప్రాప్తియు, ధర్మకార్యాచరణములు, శారీరక శ్రమయధికము. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరముగా లేనందున కొంత అశాంతి యుండును. సంఘమున గౌరవము కాపాడుకొనవలయును. కావున ఈ రాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయము, గాయత్రీ రామాయణము లేదా సుందరకాండ సంగ్రహము పారాయణ మొనర్చిన సుఖశాంతులు కలుగును. ఈ రాశి వారికి ఆది, సోమ, గురువారములు 1, 12, 19, 20, 21, 28, 29 తేదీలు శుభయోగ ప్రదయులు. మూలా వారు వైడూర్యమును పూర్వాషాఢ వారు వజ్రమును ఉత్తరాషాఢ వారు కెంపును ధరించి శుభ ఫలములు కలుగును.
తి.న.చ. సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాన్తి