స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర
సూర్య సిద్ధాన్త పంచాంగం 2021 - 2022
మకరరాశిః- (బో, జా, జి, జు, జే, జో, ఖ, గా, గి)
ఈ అక్షరములు కల ఈ రాశివారికి ఆదాయం 14, వ్యయం 14, పూజ్యం 3, అవమానము 1. ఈ రాశి వారి స్త్రీ, పురుష గుణములుః- ధనము, అధికారము, కీర్తి ప్రతిష్టల మీద ఆంకాంక్ష ఎక్కువ. ఎవరితోను స్నేహం చేయరు. ఎంతో ఓర్పు, నిదానం కల్గి ఉంటారు. బాగా కష్టపడి పనిచేస్తారు. నిర్మలమైన మనస్సు, యదార్థవాదులు, వారి శక్తి, సామర్థ్యముల వలన అభివృద్ధిలోనికి రాగలరు. కపటం లేక జీవించెదరు. యదార్థవాదులు కష్టపడకుండా లభించవు. ఎంతో నమ్మకస్తులు క్రమశిక్షణ మీద మక్కువ ఎక్కువ ఒకర్ని విమర్శించడం చెడుగా మాట్లాడటం చేయరు. వృత్తి, ఉద్యోగాల పట్ల శ్రద్ధ సంపన్నుల వలె కన్సించి యిబ్బందులు పడతారు. మర్యాదలు, ఆచార వ్యవహారములు యధావిదిగా జరుగవలెనని నమ్మకంగా ఉంటారు. సంఘమున గౌరవము కాపాడుకొందురు. కష్టజీవిగా కన్సించరు. స్వార్జితముతోనే జీవితాంతము గడపవలెనని కోరిక పూర్వము సాంప్రదాయములన్న ఎక్కువ ఇష్టం. తలచిన పని పూర్తియగు వరకు విశ్రమించరు. వ్యాపార దక్షణ కల్గియుందురు.
ఈ రాశి వారికి 1లో శని, 2లో గురువు, 5లో రాహువు, 11లో కేతువు సంచారము చేత చేయు వృత్తి, ఉద్యోగ వ్యవహర వ్యాపార రంగముల యందు మిశ్రమ ఫలితములుండును. మనస్సుకు ఆనందము, కీర్తియు, ధనలాభము అన్ని విషయములయందు పట్టుదలతో కార్యములను సాధిస్తారు. ధర్మకార్యములు చేయుట యందాసక్తియు ప్రభు సన్మానమును వేళ అతిక్రమించి బుజించు చుండుటయు సంతానముతో విరోధము, నూతన పనులు తలపెట్టుటయు, జాయింటు వ్యవహరములు, వ్యాపారముల యందు కల్సి వచ్చుటము, కోర్టు వ్యవహరముల యందు జయము, గృహమున శుభకార్యాచరణము, పుణ్యతీర్థ సందర్శనము తీర్థయాత్రా ఫలప్రాప్తియు, మనస్థాపము దాయాదులతో విరోధము తరచు అవాంతరములు, శతృమూలమున చిక్కులు, చికాకులు సంఘమున గౌరవ హనియు, పాపకర్మలందాసక్తియు, కుటుంబ కలహములు, దాయాదుల వలన నష్టములు, నూతన పనులు తలపరాదు. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారులకు ఆదాయమధికము. కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, ఫైనాన్స్ రంగాల వారికి నూతన పెట్టుబడులు వల్ల లాభము చేకూరును. వైద్య, న్యాయవాద, ఇంజనీరింగ్ వారలకు సామాన్యముగా నుండును. రాజకీయ రంగాల వారికి సంతోషమధికము. ఆశించిన పదవులుండును. కృషిపరులకు అధిక లాభము. వృత్తిరీత్యా సంఘమున సమాజమున గౌరవములుండును. సినీరంగ కళాకారులకు ప్రోత్సాహమధికము. యఙ్ఞ యాగాది క్రతువులలో పాల్గొనుట, పట్టుదలతో పనిచేసిన అద్భుత అవకాశములుండును. అపకీర్తి యధికము. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు గోభూ లాభములు క్షణికావేశం పనికి రాదు. శతృ మూలమున బాధలుండును. జాగ్రత్తగా వ్యవహరించుట అవసరము. ఈ రాశి వారు ప్రతిరోజు సుందరకాండ పారాయణము లేదా హనుమత్కవచం పఠించిన మేలు కలుగును. ఈ రాశి వారిక ఆది, సోమ, మంగల, గురువారములు 3, 10, 12, 18, 23, 27, 29, 30 తేదీలు యోగప్రదములు. ఉత్తరాషాఢ వారు కెంపును, శ్రవణం వారు ముత్యమును, ధనిష్ట వారు పగడమును ధరించిన శుభములు చేకూరును.
తి.న.చ. సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాన్తి