స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర
సూర్య సిద్ధాన్త పంచాంగం 2021 - 2022
కుంభరాశిః- (గు, గె, గో, సా, పి, సు, సే, సో, దా)
ఈ అక్షరములు కల ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, పూజ్యం 6, అవమానము1. ఈ రాశి స్త్రీ, పురుష గుణములుః- మృధుస్వభావము, దయ వినయము, మధుర వాక్కులు, విశ్వాసములను కల్గియుందురు. సామాన్యముగా ప్రవర్తనలను ఎట్టి పరిస్థితులలో మార్చుకోరు. విఘ్నములన్నింటిని దాటి ఆదర్శమును సాధింతురు. ఒంటరి తనమన్న ఇష్టముండదు. వ్యక్తులయందు అయిష్టత, ద్వేషము ఉండదు. ఉల్లాసముగా, ఉత్సాహముగా కాలము గడుపుదురు. అనుకున్న సమయానికి పనులు చేయటంలోను నేర్పరులు. అమోఘమైన జ్ఞాపకశక్తి కల్గి యుందురు. సర్వ సమాన సౌభ్రాతృత్వము మీద మక్కువ ఎక్కువ. అందరిని సోదరులు, సోదరీ మణులుగా చూడగలరు. చాటుగా పాపకర్మలు చేయుదురు. విశ్రాంతి ఎక్కువ అవసరం. గాలి, వెలుతురు ఇష్టం అభిప్రాయాలు నిశ్చతంగా వుంటాయి.
ఈ రాశి వారికి 1లో గురువ, 12లో శని, 4లో రాహువు, 10లో కేతువు సంచారము చేత చేయువృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహరముల యందు కష్టములధికము. రాజదండనాది భయములను సంఘమున గౌరవ హనియు చేయువృత్తులందు చిక్కులును బుద్ధి చాంచల్యతము ధననష్టము ాపదలు స్త్రీ మూలక కలహ కారణములు వాత రోగ భయములు మనస్తాపము శరీర అనారోగ్యము వివిధ రూపముల కష్టములు ప్రాప్తించుటయు ప్రయత్న కార్యములు నెరవేరకుండుటయు మనోవిచారము దాయాదుల వలన విరోధము శ్రమ యధికము బంధుమిత్ర విరోధము మానసిక ఆందోళన అధికము అపకీర్తియు ఉద్యోగస్థులకు జాగ్రత్త యవసరము. స్థానచలన సూచనలు జాయింటు వ్యాపారాదులు నిధానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రమాదాలు జరుగు అవకాశము కలదు. ప్రయాణముల యందు ప్రమాదములు ధర్మకార్యాచరణము, పుణ్య తీర్థ సందర్శనము, తీర్థయాత్రా ఫలప్రాప్తియు, గృహమున శుభకార్యాచరణము, కృషివరులకు అధిక లాభము, ఫైనాన్స్ బ్రోకర్లు, కాంట్రాక్టర్లకు ఆదాయముండును. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారులకు ఆదాయము అధికము. వైద్య, న్యాయవాద, ఇంజనీరింగ్ రంగాల వారికి కొంత మేలు. రాజకీయ నాయకులకు మెలకువ అవసరము. స్థిరత్వము లేకపోవుటయు రాజచోరాగ్ని బాధలు కథినముగ మాటలాడుటయు, శతృమూలమున చిక్కులు, చికాకులు ప్రయత్న కార్యములు ఫలించకుండుటయు. స్థిరాస్థులకు సంబంధించిన సమస్యలధికము. మధ్యవర్థిత్వము పనికిరాదు. నేత్రరోగ బాధలు వృధా కలహములు, పాపకర్మలు చేయుట సర్వజన విరోధము. శరీర ఆయాసము దేశ సంచారము అకాల భోజనము దుష్ట సహవాసము శరీరము శుష్కించుటయు, ఋణ మూలమున బాధలు కలుగును. ఈ రాశి వారు ప్రతిరోజు దశావతారస్తోత్రము, సుందరకాండ సప్త సర్గ పారాయణము ఆచరించిన శుభ ఫలితములు కల్గును. ఈ రాశి వార్కి ఆది, సోమ వారములు 11, 17, 20, 28, 31 తేదీలు యోగప్రదములు దనిష్ఠ వారు పగడమును శతభిషము వారు గోమేధికము పూర్వాభాద్ర వారు పుష్యరాగము ధరించి శుభఫలితములు పొందగలరు.
తి.న.చ. సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాన్తి