పాత దీపాలను పడేయకూడదు ఎందుకంటే!!
ప్రతి ఇంట్లో దీపారాధన మాములే. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నది అందరికీ తెలిసినదే. అయితే ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చేసే అలవాటు ఉన్నవాళ్లు, దీపారాధన కోసం ఉపయోగించే ఆ ప్రమిధలు పడేయకూడదని అంటున్నారు పండితు, మరియు వేద శాస్త్ర నిపుణులు.
దీపాలు పాతవి అయిపోతే చాలా మంది వాటిని మార్చేస్తారు. కారణం నూనె పట్టి నల్లగా మారి కళ తగ్గుతుంటాయని. ఎపుడో ఒకసారి దీపాలు పెట్టె వాళ్ళు ఎలా చేసుకున్న పర్వాలేదు కానీ ప్రతిరోజూ దీపారాధన చేసుకునే ఆడవాళ్లు ఆ పాత దీపాలను మార్చుకోకూడదనేది ఆశ్చర్యపరిచే విషయం.
ఇంట్లో వాడుతున్న దీపాలు పాతబడిన తరువాత వాటిని దేవుడి ముందు పెట్టడం ఎబ్బెట్టుగా అనిపిస్తుందని చాలామంది ఆడవాళ్లను పరిశీలిస్తే పరోక్షంగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంటుంది. పాతవి దేవుడి ముందు బాగలేదు అనుకుంటే వాటిని పడేయకుండా ఇంటి బయట గుమ్మానికి అటు ఇటు పెట్టడానికి లేదాతులసి కోట దగ్గర అయినా పెట్టచ్చు. అలా కూడా కుదరదు అనిపిస్తే ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళు ఫోటోల ముందు దీపారాధన చేస్తుంటారు కదా అక్కడ అయినా ఆ పాత దీపాలను పెట్టుకోవచ్చు. అంతేకానీ దీపాలు పాతగా అయిపోయాయని మూలన పడేయడమో, లేదా పడేయడమో చేయకూడదు.
కారణం ఏమిటి అనే సందేహం చాలామందికి వస్తుంది.
ప్రతి కుటుంబంలో దీపారాధనకు, దీపాలకు, దీపం వెలిగించే వారికి మధ్య చెప్పలేని అనుబంధం ఉంటుంది. ఎలా అంటే దీపారాధ చేసేటప్పుడు చాలామంది తమ మనసులోని బాధలు, కష్టాలు ఆ దేవుడితో చెప్పుకుంటూ ఉంటారు. ఫలితంగా దేవుడికి, భక్తుడికి మధ్య ప్రత్యేక్ష సాక్ష్యంగా నిలిచేది దీపం. మనుషుల సకల సమస్యలను తనలో నింపుకుని ఇంటికి వెలుగును ఇచ్చేది దీపం. అలాంటి దీపాలను విరిగిపోతేనో, లేదా వాడటానికి కాకుండా నూనె కారడం వంటివి జరిగితేనో తప్ప పడెయ్యకూడదు. దీపాలు పాతవి అయినా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ అభిరుచి కొద్దీ రంగులు వేసి ఆకర్షణీయంగా మార్చుకుని వాడుకోవచ్చు.
మనము ఒక కష్టాన్ని భగవంతుడుకి చెప్పుకుంటే మన పూజ గదిలో దీపాలు కూడా భగవంతుడుని ప్రార్తిస్థాయి, మనము సంతోషం గా దీపం పెట్టి పూజ చేసినప్పుడు భగవంతుడుకి కృతజ్ఞతలు చెప్పుకుంటాయి.
దీపంలో నూనె అయిపోతే కొండెక్కి పోతుంది అనుకుంటారు ఆ ప్రమిద చివరి భాగంలో గూడు కట్టిన మసిలో దీపం ఇంటి ఏజమాని వచ్చే వరకు ఆ ఇంటి ఇల్లాలుకి తోడుగా ఉంటుంది, ఆమె భర్త బిడ్డలు క్షేమంగా ఇల్లు చేరాలి అని భగవంతుడుని ప్రతిస్తూ ఉంటాయి అంటారు. అందుకే చాలా కాలంగా పూజించిన దీపాలకు కూడా చాలా విలువ ఉంటుంది మహిమ ఉంటుంది. ప్రాణం వుంటుంది.
అందుకే పాత దీపాలు అనుకోకుండా శుభ్రంగా ఉంచి వాడుకోవాలి. వాటికి మనం ఇచ్చే విలువను బట్టి ఆ దేవుడు మనకు ప్రాధాన్యత ఇస్తాడు.
◆ వెంకటేష్ పువ్వాడ