మేషరాశి:- (చూ,చే, చో, ల, లీ, లూ, లే, లో, ఆ)
ఆదాయం : 14, వ్యయం : 14 - రాజపూజ్యం : 3, అవమానం : 6
వీరికి ఈ సంవత్సరం ప్రారంభము నుండి వైశాఖ శుక్లం వరకు, తిరిగి ఆషాఢం నుండి పుష్య బహుళం వరకు దశమశని అగుటచే ఉద్యోగ విఘ్నము, పాపకార్యాసక్తి, వ్యవసాయమునందు నష్టము, వ్యాకులత, నష్టము కలుగును. వైశాఖ శుక్లం నుండి జ్యేష్ఠ బహుళం వరకు ఏకాదశ శనియగుటటే సర్వము | అనుకూలించును. సకల కార్యముల యందు లాభము, జయము, ప్రోత్సాహము | కలుగును. ఆరోగ్యము, ద్రవ్యలాభము, భార్యాపుత్రాది స్వజన లాభము కలుగును. సంవత్సరారంభమున మొదటి పక్షము ఏకాదశ గురువు అయినందున పరిస్థితులు అనుకూలించిననూ, పిదప సంవత్సరమంతయూ వ్యయ గురువు అగుటచే అపనిందలు, ధనవ్యయము, స్థానచలనము కలుగును. పరిస్థితులు | శ్రమకరముగనుండగలవు. రాజాగ్రహమునకు గురియగుట, కీర్తిహాని, ఆస్తి సంబంధ | వివాదములు కలుగును. సంవత్సర ప్రారంభమున మొదటి పక్షమున ద్వితీయ రాహువు, అష్టమ కేతువు, పిమ్మట జన్మరాహువు, సప్తమ కేతువు అగుటచే | వృథా వైరములు, భార్యాపుత్రాది స్వజన విరోధములు, ఆరోగ్యలోపములు, కళత్రవర్గములో పేచీలు ఏర్పడగలవు. భాద్రపద, ఆశ్వయుజములందు సకల కార్యములయందు జాగ్రత్తగా నుండవలయును.
అశ్వినీ నక్షత్రం వారికి సంవత్సర ప్రారంభం నుండి ఆశ్వయుజ బహుళం వరకు నైధనతార యందు కేతువు, ఫాల్గునమందు జన్మతార యందు రాహువు సంచరించుదురు. భరణి వారికి జ్యేష్ఠ బహుళం నుండి మాఘమాసం వరకు జన్మతార యందు రాహువు సంచరించును. కృత్తిక వారికి సంవత్సరారంభం నుండి జ్యేష్ఠశు | క్లం వరకు జన్మతార యందు రాహువు సంచరించును. మరియు ఆశ్వయుజ బహుళం వరకు కేతువేధ, ఆశ్వయుజ బహుళం నుండి కార్తిక శుక్లం వరకు శనివేధయు గలదు. కావున ఆయా సమయముల యందు ఆయా గ్రహములకు శాంతి యొనర్చిన మేలు. మొత్తము మీద వీరు శని, గురు, రాహు, కేతువులకు శాంతియొనర్చిన మంచిది. ఆదిత్యహృదయ పారాయణ, హనుమత్పూజా ప్రదక్షిణముల వలన దోషములు తొలగగలవు.