వృషభరాశి:- (ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో)
ఆదాయం : 8, వ్యయం : 8 - రాజపూజ్యం : 6, అవమానం : 6
వీరికి ఈ సంవత్సరము శని భాగ్యరాజ్యముల యందు సంచరించును కావున అనుకూలుడు కాదు. శుభకార్యవిఘ్నము, పితృ లేదా సదృశ వ్యక్తికి తీరని కష్టము, మనోవ్యాకులతయుండును. కళత్ర, పుత్రమూలక వ్యధ, ఒకప్పుడు ధనలాభము, ఒకప్పుడు ధననష్టము కలుగును. ఉద్యోగ భంగము కూడా కలుగ వచ్చును. చైత్ర బహుళం నుండి ఏకాదశ గురువు అగుటచే పరిస్థితులు అనుకూలించును. సంతానవృద్ది, నూతనకృషి లాభము, గౌరవము, యత్నకార్యసిద్ధి యగును. ఉత్సాహముగనుండును. కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, సుఖము, విరోధి నాశనము, మంత్రసిద్ధి కలుగును. చైత్రశుక్లమున జన్మరాహువు, సప్తమకేతువు కనుక కొంతమేరకు పరిస్థితులు అనుకూలించును. లాభము, జయము, ప్రోత్సాహము | కలుగగలవు. గో, భూలాభము కలుగును. గత సంవత్సరము కన్నా కొంత మెరుగుగ నుండగలదు. శ్రావణ బహుళం నుండి జన్మరాశిలో కుజసంచారము వలన ఆరోగ్య | కృత్తిక వారికి సంవత్సర ప్రారంభము నుండి జ్యేష్ఠ శుక్లం వరకు జన్మతార యందు రాహువు సంచరించును. మరియు ఆశ్వయుజ బహుళం వరకు కేతువేధ, ఆశ్వయుజ బహుళం నుండి కార్తిక శుక్లం వరకు శనివేధయు కలదు. రోహిణి వారికి ఆశ్వయుజ బహుళం నుండి కార్తిక శుక్లం వరకు జన్మతార యందు శని, మార్గశిర బహుళం నుండి మాఘ బహుళం వరకు జన్మతార యందు కుజుడు, ఫాల్గునమందు నైధనతార యందు కేతువు సంచరించుదురు. మృగశిర వారికి ఆశ్వయుజం నుండి మార్గశిరం వరకు, తిరిగి ఫాల్గునమందు జన్మతార యందు కుజుడు, సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ శుక్లం వరకు, తిరిగి కార్తిక బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతార యందు శని, జ్యేష్ఠ బహుళం నుండి మాఘ బహుళం వరకు నైధనతార యందు రాహువు సంచరించుదురు. కావున ఆయా సమయములందు జాగ్రత్తగానుండి, తగిన శాంతియొనర్చవలయును. హనుమత్పూజా ప్రదక్షిణములు, గురుసేవ వలన దోషములు తొలగగలవు.