కర్కటక రాశి;- (హి, హు, హే, హో,డా, డీ, డూ, డే, డో )
ఆదాయం : 5, వ్యయం : 5 - రాజపూజ్యం : 5, అవమానం : 2
వీరికి ఈ సంవత్సరమంతయు శని సప్తమ, అష్టమ రాశులలో సంచరించుటచే అనుకూలుడు కాదు. కొన్ని ఇబ్బందులు వచ్చును. స్వజన విరోధము |కలుగును. చోరాగ్ని బాధలు కలుగును. ఆరోగ్యలోపము, అకాల భోజనము కలుగును. | ధనవ్యయము, ప్రమాదములు, అపనిందలు, గౌరవహాని కలుగును. చైత్రశుక్లం | వరకు అష్టమ గురువు అయినందున కొన్ని సమస్యలు ఉన్ననూ, చైత్ర బహుళం నుండి నవమ గురువు అయినందున చాలా వరకు పరిస్థితులు అనుకూలించును. | గౌరవమర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలు కలుగును. రాజదర్శనము, ఇష్టకార్యసిద్ధి కలుగును.
చైత్ర శుక్లము వరకు లాభగురువు అనుకూలముగా ఉన్ననూ, పిదప చైత్ర బహుళం | నుండి దశమ రాహువు, చతుర్థ కేతువు అయినందున శుభాశుభ మిశ్రమముగనుండగలదు. చిత్తచాంచల్యము, వాతరోగములు, ప్రయాణాదుల |యందు ఇబ్బందులు ఉండును. ఉద్యోగాదుల యందు కొంత ఇబ్బంది ఉన్ననూ |తలచిన కార్యములు నెరవేరును. ప్రారంభమున నాలుగు మాసములు కుజుడు | అనుకూలంగా లేనందున జాగ్రత్త అవసరము.
పునర్వసు వారికి మార్గశిర బహుళం నుండి మాఘ బహుళం వరకు | నైధనతార యందు కుజుడు, ఆశ్వయుజ బహుళం నుండి కార్తిక శుక్లం వరకు నైధనతార యందు శని, సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ బహుళం వరకు జన్మతార యందు కేతువు సంచరించుదురు. పుష్యమి వారికి ఆశ్వయుజ శుక్లం | నుండి మార్గశిర బహుళం వరకు, తిరిగి ఫాల్గునమందు నైధనతార యందు కుజుడు, సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ శుక్లం వరకు, తిరిగి కార్తిక బహుళం | నుండి సంవత్సరాంతము వరకు నైధనతార యందు శని సంచరించుదురు. ఆశ్లేష వారికి సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ శుక్లం వరకు శనివేధ కలదు. ఆశ్వయుజ బహుళం నుండి నైధనతార యందు కేతువు సంచరించును. కావున ఆయా సమయముల యందు ఆయా గ్రహములకు తగు శాంతి యొనర్చిన మేలు. మొత్తము మీద వీరు శని, రాహు, కేతువులకు శాంతియొనర్చిన మేలు. అశ్వత్థనారాయణ సేవ, గురుసేవ యొనర్చిన మేలు జరుగును.