తులా రాశి:- (రా, రి, రూ, రే, రో, త, తీ, తూ, తే)
ఆదాయం : 8, వ్యయం : 8 - రాజపూజ్యం : 7, అవమానం : 1
వీరికి ఈ సంత్సరమంతయూ శని చతుర్థ, పంచమ రాశులయందు సంచరించుటచే క్లిష్టమయిన కాలము. అనేక సమస్యలు వచ్చును. జాగ్రత్త అవసరము. కళత్రపీడ, ఆస్తినష్టము, శారీరక, మానసిక శ్రమ, స్వస్థానహాని, వాత బాధలు కలుగును. మనస్తాపము, స్వజన విరోధము, మర్యాదాభంగము కూడా తరచుగా కలుగును. చైత్ర శుక్లమున గురువు అనుకూలముగనున్ననూ, చైత్ర బహుళం నుండి షష్ఠ గురువు అగుటటే శత్రుజ్ఞాతిబాధలు, వ్యాజ్యములు, చోరరోగ బాధలు అధికముగనుండగలవు. దాదాపు సంవత్సరమంతయూ జన్మరాశిలో కేతువు, సప్తమ రాహువు అయినందున వృథా వ్యయములు, వృధా వైరములు కలుగును. తరచుగా | ఇబ్బందులు వచ్చును. ఆరోగ్యలోపములు కలుగవచ్చును. కళత్రవర్గములో పేచీలు వచ్చును. అషాఢము నుండి కుజుడు సప్తమ, అష్టమ రాశుల యందు సంచరించును | కావున అత్యంత జాగ్రత్తగా నుండవలయును. సాహసకృత్యములు మానవలయును. చిత్ర వారికి ఆశ్వయుజం నుండి మార్గశిర శుక్లం వరకు తిరిగి | ఫాల్గునమందు జన్మతార యందు కుజుడు, సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ శుక్లం వరకు, తిరిగి కార్తిక బహుళం నుండి జన్మతార యందు శని, జ్యేష్ఠ బహుళం నుండి మాఘం వరకు నైధనతార యందు రాహువు సంచరించుదురు. స్వాతి వారికి జ్యేష్ఠశుక్లం వరకు నైధనతార యందు రాహువు, ఆశ్వయుజ బహుళం నుండి జన్మతార యందు కేతువు సంచరించుదురు. విశాఖ వారికి మార్గశిర బహుళం నుండి మాఘ బహుళం వరకు నైధనతార యందు కుజుడు, ఆశ్వయుజ బహుళం నుండి కార్తిక శుక్లం వరకు నైధనతార యందు శని, ఆశ్వయుజ బహుళం వరకు జన్మతార యందు కేతువు సంచరించుదురు. సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ శుక్లం వరకు శనివేధ, జ్యేష్ఠ శుక్లం వరకు రాహువేధయు కలదు. కావున జాగ్రత్త అవసరము. ప్రధాన గ్రహములన్నియూ బాగుగలేనందున నవగ్రహ శాంతి ఆచరించవలయును. ప్రతి మాసము తమ జన్మ నక్షత్రము నాడు, మాస శివరాత్రికి, | కార్తిక మాసమందు ప్రతి సోమవారము పరమేశ్వర ప్రీతిగ అభిషేకము, హనుమత్పూజా ప్రదక్షిణములు, అశ్వత్థనారాయణ సేవ యొనర్చిన అర్ధాష్టమ శని | దోషముతో పాటు, సర్వగ్రహ దోషములు తొలగును.