వృశ్చిక రాశి:- (తొ, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ)
ఆదాయం : 14, వ్యయం : 14 - రాజపూజ్యం : 3, అవమానం : 1
వీరికి ఈ సంవత్సరము వైశాఖ జ్యేష్ఠములందు, తిరిగి మాఘ ఫాల్గునములందు అర్ధాష్టమశని యగుటచే శ్రమకరమగు కాలము. అనేక సమస్యలు | వచ్చును. జాగ్రత్త అవసరము. శారీరక, మానసిక శ్రమ, స్వస్థానహాని, వాత బాధలు | కలుగును. మిగిలిన సమయమంతయూ తృతీయశని యగుటచే చాలావరకు అనుకూలమయిన కాలము. ఋణవిముక్తి, భూ,గృహ సంపాదన, ఉద్యోగప్రాప్తి కలుగును. స్వబుద్ధితో ప్రయత్నించిన కార్యములు నెరవేరును. భ్రాతృవర్గ వ్యాజ్యములు, | పేచీలు పరిష్కరించబడును. చైత్ర బహుళం నుండి పంచమ గురువు అగుటచే చాలావరకు పరిస్థితులు అనుకూలముగనుండును. పుత్రవృద్ధి, సుజన మిత్రత్వము, | ప్రభు అనుకూలతయుండును. చైత్ర బహుళం నుండి షష్ఠరాహువు, వ్యయకేతువు అయినందున సకల కార్యములయందు జయము, ధైర్యము, కలుగును. శత్రుజయమగును. గో, భూలాభము కలుగును. ఆదాయమునకు మించి | వ్యయమగుట వలన కొన్ని సమస్యలు వచ్చును. శ్రావణ బహుళం నుండి కుజుడు | సప్తమ, అష్టమ రాశుల యందు సంచరించును కావున జాగ్రత్త అవసరము. మొత్తము మీద వీరికి గతం కంటే చాలా అనుకూలముగనుండగలదు.
విశాఖ వారికి మార్గశిర బహుళం నుండి మాఘ బహుళం వరకు నైధనతార యందు కుజుడు, ఆశ్వయుజ బహుళం నుండి కార్తిక శుక్లం వరకు నైధనతార యందు శని, సంవత్సరారంభం నుండి ఆశ్వయుజ బహుళం వరకు జన్మతార యందు కేతువు సంచరించుదురు. సంవత్సరారంభం నుండి ఆశ్వయుజ శుక్లం వరకు శనివేధ మరియు జ్యేష్ఠ శుక్లం వరకు రాహువేధ కలదు. అనూరాధ వారికి | ఆశ్వయుజ బహుళం నుండి మార్గశిర శుక్లం వరకు, తిరిగి ఫాల్గునమందు నైధనతార యందు కుజుడు, సంవత్సరారంభం నుండి ఆశ్వయుజ శుక్లం వరకు, తిరిగి కార్తిక | బహుళం నుండి నైధనతార యందు శని సంచరించుదురు. జ్యేష్ఠ బహుళం నుండి మాఘం వరకు రాహువేధ కలదు. జ్యేష్ఠ వారికి ఆశ్వయుజ బహుళం నుండి నైధనతార యందు కేతువు సంచరించును. కావున ఆయా సమయములందు ఆయా |గ్రహములకు శాంతియొనర్చిన మేలు. అర్ధాష్టమ శని సమయమున హనుమత్పూజా | ప్రదక్షిణములతో పాటు ప్రతినెలా తమ జన్మనక్షత్రము నాడు, మాస శివరాత్రికి పరమేశ్వర ప్రీతిగ శాంతియొనర్చిన దోషము తొలగును.