ధనూ రాశి:- (యే, యో, బా, బి, బూ, ధ, భ, ఢ, బె)
ఆదాయం : 2, వ్యయం : 8 - రాజపూజ్యం : 6, అవమానం : 1
వీరికి ఈ సంవత్సరము వైశాఖ, జ్యేష్ఠ, మాఘ, ఫాల్గునములందు తృతీయ శని అగుటచే చాలావరకు అనుకూలమయిన కాలము. ఋణవిముక్తి, భూ,గృహ | సంపాదన, ఉద్యోగప్రాప్తి కలుగును. స్వబుద్ధితో ప్రయత్నించిన కార్యములు సిద్ధించును. | భ్రాతృవర్గములో గల పేచీలు పరిష్కరించబడును. మిగిలిన సమయమంతయూ ద్వితీయశని అగుటచే ధనవ్యయము, తేజోహాని, అకారణ కలహములు, ఎల్లప్పుడు | కష్టము, కార్యనాశనము, స్వజనవిరోధము, పాప చింతన కలుగును. సంవత్సరారంభమున తృతీయ గురువు పిదప చైత్ర బహుళం నుండి చతుర్థ గురువు | అగుటచే కొన్ని కార్యములు నెరవేరిననూ ఉద్యోగభంగము, మిత్రవియోగము, | కార్యభంగము, బంధువియోగము, తేజోహాని, స్వస్థానత్యాగము ఒకప్పుడు కలుగును. ప్రారంభమున షష్ఠరాహువు, వ్యయకేతువు, చైత్ర బహుళం నుండి పంచమ రాహువు, ఏకాదశ కేతువు అయినందున కొంత లాభము, జయము, ప్రోత్సాహము, సన్మానము జరుగును. పశులాభము, పుత్రమూలక వ్యధ కలుగును. వైశాఖ, జ్యేష్ఠములందు | | కుజుడు అనుకూలుడు కానందున జాగ్రత్త అవసరము. మూలా నక్షత్రము వారికి సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ బహుళం | వరకు నైధనతార యందు కేతువు, ఫాల్గునమందు జన్మతార యందు రాహువు సంచరించుదురు. పూర్వాషాఢ వారికి జ్యేష్ఠ బహుళం నుండి మాఘం వరకు జన్మతార యందు రాహువు సంచరించును. ఉత్తరాషాఢ వారికి జ్యేష్ఠ శుక్లం వరకు | జన్మతార యందు రాహువు సంచరించును. ఆశ్వయుజ శుక్లం నుండి మార్గశిర శుక్లం వరకు, తిరిగి ఫాల్గునమందు రాహువేధ కలదు. కావున ఆయా సమయముల యందు ఆయా గ్రహములకు శాంతియొనర్చిన మేలు. ముఖ్యముగా శని, గురువులకు | ప్రత్యేక శాంతియొనర్చిన మేలు. గురుసేవ, సుందరకాండ పారాయణము వలన దోషములు తొలగును.