సరస్వతి దేవి నాలుకపై కొలువయ్యే సమయం ఇదే..!

హిందూ ధర్మంలో త్రిమూర్తులకు ప్రాముఖ్యత ఉన్నట్టే.. లక్ష్మీ, సరస్వతి, పార్వతి దేవికి కూడా అలాగే ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ దేవి సంపదకు, పార్వతీ దేవి సౌభాగ్యానికి, సరస్వతి దేవి జ్ఞానానికి విద్యకు అధిదేవతలుగా ఉంటారు.
హిందూ నమ్మకాల ప్రకారం రోజులోని 24 గంటలలో కొన్ని ప్రత్యేక క్షణాల పాటు జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి దేవి నాలుక పై కొలువై ఉంటుందట. ఈ సమయంలో పలికే ప్రతి మాటకు శక్తి వస్తుందని, ఆ మాట నిజమవుతుందని అంటున్నారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఆ సమయం ఏది? పూర్తీగా తెలుసుకుంటే..
పద్శ పురాణ శ్లోకం..
జిహ్వాగ్రే వసతే విద్యా జిహ్వాగ్రే మిత్రబాన్ధవః ।
జిహ్వాగ్రే బన్ధనం ప్రపతం జిహ్వాగ్రే మరణం ధ్రువమ్ ।
నాలుక పై ఏ సమయంలో కొలువై ఉంటుంది?
శాస్త్రాలు పగలు, రాత్రిలోని ప్రతి గంటను శుభ, అశుభ సమయాలుగా వర్గీకరిస్తాయి. తెల్లవారుజామున 3 గంటల తర్వాత కాలాన్ని "బ్రహ్మ ముహూర్తం" అని అంటారు, ఇది ఒక కొత్త, శుభకరమైన రోజు ప్రారంభాన్ని సూచిస్తుంది. నమ్మకాల ప్రకారం, తెల్లవారుజామున 3:10 నుండి 3:15 గంటల మధ్య సమయం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మనసులో ఏదైనా కోరుకున్నా లేదా మాటల్లో చెప్పినా, ఏ మంచి కోరిక అయినా తప్పకుండా నెరవేరుతుందని అంటారు.
మరోవైపు, తెల్లవారుజామున 3:20 నుండి 3:40 గంటల మధ్య నాలుకలో సరస్వతీ దేవి నిజంగా నివసిస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో పలికిన ప్రతి మాటకు విశ్వాన్ని చేరి వాస్తవ రూపం దాల్చే శక్తి ఉంటుందట.
విద్యార్థులకు మంచిది..
చదువుకుంటున్న లేదా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం ఒక వరం వంటిది. విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని , సరస్వతీ దేవి అనుగ్రహాన్ని కలిగిచే మంత్రాన్ని సాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయట.
మంత్రం..
"ఓం ఐం హ్రీం క్లీం మహాసరస్వతీ దేవ్యై నమః"
ప్రతి ఉదయం బ్రహ్మ ముహూర్తంలోని శుభ సమయంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల మేధస్సు పదునుదేరి, ఏకాగ్రత పెరిగి, మానసిక వికాసం చాలా వేగంగా జరుగుతుందట.
*రూపశ్రీ.


